Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గాంధీ జయంతి రోజే గాంధీ సిద్ధాంతాలకు తూట్లు –

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గాంధీ జయంతి రోజే గాంధీ సిద్ధాంతాలకు తూట్లు –

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
  • మద్యపాన నిషేధానికి ప్రతీక అయిన మహాత్మా గాంధీ జయంతి రోజున...
  • దేశమంతా మద్యం దుకాణాలు మూసి ఉన్నా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాత్రం మద్యం ఏరులై పారింది!

సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
మద్యపాన నిషేధానికి ప్రతీక అయిన మహాత్మా గాంధీ జయంతి రోజున… దేశమంతా మద్యం దుకాణాలు మూసి ఉన్నా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాత్రం మద్యం ఏరులై పారింది!
అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది. కానీ సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, దొరవారిసత్రం, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని పలు ప్రాంతాలలో యథేచ్ఛగా మద్యం విక్రయించాయి..
ఎమ్మార్పీ రేటుకు రెట్టింపు రేటుగా రూ. 150 ఉన్న క్వార్టర్ ను రూ. 250-300కు అమ్ముతున్న కానరాని ఎక్సైజ్ అధికారులు..
మెయిన్ షాపులు మూసి ఉన్నా, గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా దొరికింది..
గాంధీ జయంతి లాంటి డ్రై డే రోజున కూడా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు కనిపించలేదు. కనీసం తనిఖీలు కూడా చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

డ్రై డే రోజు కూడా మద్యం అమ్మకాలను అడ్డుకోలేని ప్రొహిబిషన్ శాఖ ఎందుకు? బెల్ట్ షాపులపై నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారా? జిల్లా కలెక్టర్, సెబ్ అధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *