Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

దువ్వాడ JNNURM కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దువ్వాడ JNNURM కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

విశాఖపట్నం, అక్టోబర్ 2: దువ్వాడ మంగళ పాలెం గ్రామం JNNURM కాలనీలో 157వ గాంధీ జయంతి వేడుకలను కాలనీ నాయకులు, పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. కాలనీ నాయకులు, పెద్దలు సమన్వయంతో వేడుకలను నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్యామ్, మిలట్రీ ఈశ్వరరావు, గణేష్, ప్రభాకర్, మోహన్, ఈశ్వరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దువ్వాడ JNNURM కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *