Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సత్యమే ఆయుధం…… అహింసే మార్గం…. గాంధీజీ ఆశయాలే మనకు ఆదర్శం

మంగమారిపేటలో ఘనంగా గాంధీ జయంతి

మంగమారిపేట (పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 2 :: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా 4వ వార్డు మంగమారిపేట ZPH పాఠశాల ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, శ్రీశ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు సభ్యులు గరికిన ఎల్లయ్య (కింగ్), వార్డు వైస్ ప్రెసిడెంట్ వాసుపల్లి ఎల్లయ్య, వాసుపల్లి రాజు మాట్లాడుతూ.. సత్యం, అహింసా మార్గాల్లో నడిచి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సూరాడ నర్సింగరావు (అడ్వకేట్), దూడ రమేష్, దౌవలపల్లి ఎల్లాజీ, గరికిన దిలీప్, వాసుపల్లి శంకర్రావు, వాసుపల్లి సూరాడ నూకరాజు, బొడ్డు రాము, బడే రాము, బడే నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *