Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

షాపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా గ్రామసభ మరియు గాంధీ జయంతి వేడుకలు

​ జఫర్గడ్ మండలం షాపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ తాళ్ల పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పనులు, రైతుల అవసరాలు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తదనంతరం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమతా రాజు, కార్యదర్శి చలపతి, ఏఈఓ శ్వేత, అంగన్వాడి టీచర్ నసీమా సుల్తానా, ఫీల్డ్ అసిస్టెంట్ హరిబాబు, వార్డు సభ్యులు లలితా ప్రభాకర్, ఎండీ ముస్తఫా, మాచర్ల శివ, ఉగంటి పద్మ, ఆశా వర్కర్ మమత, మహిళా సంఘం సీఏ మమతతో పాటు గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *