ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండల హెడ్‌క్వార్టర్‌లోని 33 కేవీ నెల్లూరు లైన్ రైల్వే క్రాసింగ్ వద్ద చేపట్టిన డ్రిల్లింగ్ పనులను ఎలక్ట్రికల్ ఏఈ అనిల్‌కుమార్, హెడ్‌క్వార్టర్ లైన్మెన్ కిషోర్‌కుమార్ పరిశీలించారు. రైల్వే క్రాసింగ్ వద్ద కేబుల్ దెబ్బతినడంతో గత కొన్ని నెలలుగా నెల్లూరు నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా పొందలేకపోతున్నారు. గూడూరు 33 కేవీ లైన్‌కు ఎల్సీ తీసుకున్న సమయంలో మనుబోలు పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. సమస్య పరిష్కారానికి పనులు వేగవంతం చేశామని, అతి త్వరలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఏఈ అనిల్‌కుమార్ తెలిపారు.

విద్యుత్ సరఫరా మెరుగుదలకు 33 కేవీ లైన్ పనులు వేగవంతం