వార్త ముఖ్యాంశాలు
- సుండుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సుండుపల్లి మండల టౌన్ సచివాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు.
- ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
- అనంతరం 2026–27 సంవత్సరానికి వి.వి.జీ.
సుండుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సుండుపల్లి మండల టౌన్ సచివాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2026–27 సంవత్సరానికి వి.వి.జీ. రాంజీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, సిబ్బంది చర్చించారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ మాలేపాటి శివరామనాయుడు, మండల ఏపీఓ మాలిక్‌భాష, వెలుగు సీసీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.