Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోబాకలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోబాకలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

వార్త ముఖ్యాంశాలు

  • ఏర్పేడు, మే 08 (పున్నమి న్యూస్): త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ మరియు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పేడు మండలం కోబాక గ్రామంలోని ఎస్సీ కాలనీలోని శ్రీ రామాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
  • గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని వినియోగించుకున్నారు.
  • ఈ శిబిరంలో మొత్తం 26 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 11 మందికి కంటి శుక్లాలు, మరో వ్యక్తికి టెర్రిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఏర్పేడు, మే 08 (పున్నమి న్యూస్): త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ మరియు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పేడు మండలం కోబాక గ్రామంలోని ఎస్సీ కాలనీలోని శ్రీ రామాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో మొత్తం 26 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 11 మందికి కంటి శుక్లాలు, మరో వ్యక్తికి టెర్రిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగులకు అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి తదుపరి చికిత్స కోసం ప్రత్యేక సూచనలు చేసినట్లు వైద్య బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ సిబ్బంది దామోదర్, నందిని పాల్గొనగా గ్రామస్తులు పవన్ కుమార్ పర్యవేక్షణలో శిబిరం విజయవంతంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *