Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శుక్రవారం ఉదయగిరిలో ప్రత్యేక గ్రామసభలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శుక్రవారం ఉదయగిరిలో ప్రత్యేక గ్రామసభలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: రిఫార్మ్ ఉత్సవ్, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్‌లో భాగంగా శుక్రవారం ఉదయగిరి మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుకుమార్ తెలిపారు.
  • ఈ సందర్భంగా ఏడు మంత్రిత్వ శాఖలకు చెందిన 13 ప్రధాన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
  • పథకాలకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రయోజనం పొందని వారి వివరాలను సేకరించి జాబితా సిద్ధం చేయనున్నారు.

ఉదయగిరి: రిఫార్మ్ ఉత్సవ్, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్‌లో భాగంగా శుక్రవారం ఉదయగిరి మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏడు మంత్రిత్వ శాఖలకు చెందిన 13 ప్రధాన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పథకాలకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రయోజనం పొందని వారి వివరాలను సేకరించి జాబితా సిద్ధం చేయనున్నారు. గ్రామసభలో ఆ జాబితాను ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సుకుమార్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *