செய்தியின் முக்கிய அம்சங்கள்
- ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ఉదయగిరి, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశాలు, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడినట్లు మేకపాటి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
- కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
- మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ఉదయగిరి, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశాలు, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడినట్లు మేకపాటి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి సమావేశాలు, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాల తేదీలను త్వరలో ప్రకటిస్తామని కార్యాలయం వెల్లడించింది. పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. మేకపాటి కార్యాలయం, ఉదయగిరి.