Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మింది ATM రోడ్డు ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీస్ కమిషనర్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మింది ATM రోడ్డు ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీస్ కమిషనర్*

వార్త ముఖ్యాంశాలు

  • మింది ATM రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న భారీ ట్రాఫిక్ సమస్యపై మాజీ కార్పొరేటర్ *గుడివాడ అనూష* గారు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
  • దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక ట్రాఫిక్ పోలీసులను మింది ATM రోడ్డుకు పంపించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
  • అనంతరం గాజువాక CI గారికి మరియు కమిషనర్ గారికి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు.

మింది ATM రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న భారీ ట్రాఫిక్ సమస్యపై మాజీ కార్పొరేటర్ *గుడివాడ అనూష* గారు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక ట్రాఫిక్ పోలీసులను మింది ATM రోడ్డుకు పంపించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గాజువాక CI గారికి మరియు కమిషనర్ గారికి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు.

మింది ATM రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితిని మరింతగా అధ్యయనం చేసేందుకు రానున్న కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధుల్లో ఉంచి, వాహనాల రాకపోకలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన పోలీస్ కమిషనర్ గారికి, గాజువాక ట్రాఫిక్ పోలీసులకు మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *