Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ...
  • కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ జేబు సంస్థగా మారిందని, ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును బలహీనపరుస్తోందని తీవ్రంగా విమర్శించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ… కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ జేబు సంస్థగా మారిందని, ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును బలహీనపరుస్తోందని తీవ్రంగా విమర్శించారు.
​ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఈసీదేనని, తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
​ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కోరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, ముంజాల సాయిలు, గడ్డమీది బాలకృష్ణ, కట్కూరి శ్రీనివాసరెడ్డి, కందికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *