Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాఠశాలకు ఇన్వర్టర్ అందజేసిన పూర్వ విద్యార్థి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాఠశాలకు ఇన్వర్టర్ అందజేసిన పూర్వ విద్యార్థి

వార్త ముఖ్యాంశాలు

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక బస్వా వారి సెంటర్‌లోని MPPP మెయిన్ పాఠశాలకు పూర్వ విద్యార్థి, మాజీ సర్పంచ్ రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజా గురువారం ఇన్వర్టర్‌ను అందజేశారు.
  • విద్యుత్ అంతరాయం కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కలగకుండా, డిజిటల్ తరగతులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ సాయం చేసినట్లు తెలిపారు.
  • ఎస్ఎంసీ చైర్మన్ ముచ్చర్ల వెంకటేష్ ద్వారా ఇన్వర్టర్‌ను పాఠశాలకు అందించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక బస్వా వారి సెంటర్‌లోని MPPP మెయిన్ పాఠశాలకు పూర్వ విద్యార్థి, మాజీ సర్పంచ్ రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజా గురువారం ఇన్వర్టర్‌ను అందజేశారు. విద్యుత్ అంతరాయం కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కలగకుండా, డిజిటల్ తరగతులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ సాయం చేసినట్లు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ ముచ్చర్ల వెంకటేష్ ద్వారా ఇన్వర్టర్‌ను పాఠశాలకు అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పేర్కొన్నారు. పాఠశాల అవసరాన్ని గుర్తించి ఇన్వర్టర్ అందజేసిన దాత రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజాను ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *