అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంక గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 33,906 మంది లబ్ధిదారులకు రూ.14.57 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మత్స్యకారులు తదితర అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
