డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని నా నివాస గృహంలో దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్, స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారి 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి పాల్గొని తన తండ్రి జీఎంసీ బాలయోగి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలయోగి గారు ప్రజా జీవితంలో అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన బాలయోగి గారి సేవా స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాలయోగి గారికి ఘన నివాళులు అర్పించారు.
