Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-19 క్రికెట్‌కు చిట్వేలు విద్యార్థినులు

అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు చిట్వేలు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పసుపుల కుసుమిత, నయనాల గ్రీష్మిత సాయి ఎంపికయ్యారు. గురువారం రైల్వేకోడూరులోని సాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్‌-19 క్రికెట్ ఎంపికల్లో ఉమ్మడి కడప జిల్లా జట్టుకు వీరు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, సీనియర్ ఉపాధ్యాయురాలు సోఫియా, ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ అభినందించారు. విద్యార్థినులకు శిక్షణ అందించిన పీడీ రమాదేవిని కూడా వారు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *