వార్త ముఖ్యాంశాలు
- నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి.
- ప్రముఖ వ్యాపారవేత్త రేగటి అనిల్ రెడ్డి తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి సుమారు 500 మందితో వైసీపీ కండువా కప్పుకున్నారు.వ్యాపారవేత్తగా కొనసాగుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన రేగటి అనిల్ రెడ్డి...
- పార్టీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు.
నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త రేగటి అనిల్ రెడ్డి తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి సుమారు 500 మందితో వైసీపీ కండువా కప్పుకున్నారు.వ్యాపారవేత్తగా కొనసాగుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన రేగటి అనిల్ రెడ్డి… పార్టీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు.
గతంలో టీడీపీ నాయకుడిగా పనిచేసిన తన తాత మునిశేషి రెడ్డికి నంద్యాలలో మంచి ప్రజాబలం ఉందని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి యువ నాయకత్వం పట్ల ఆకర్షితుడై వైసీపీలో చేరినట్లు రేగటి అనిల్ రెడ్డి తెలిపారు.అనిల్ రెడ్డితో పాటు చేరిన 500 మందికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నపుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప రాజకీయాలు చేయలేదని కుల మతాలకు , పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో ఒక్క శాశ్వత పని కూడా చేయలేదని వైకాపా పార్టీలో చేసిన పనులను పూర్తి చేయలేకపోయారు.ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వైకాపా పార్టీ అధికారంలో ఉన్నపుడు నిర్మించినవే అదే విధంగా టీడీపీ నాయకులు పిల్లి అద్దంలో చూసుకుని పులిలాగ ఉన్నామని అనుకుంటున్నారని ప్రజలు ఎవ్వరికి విలువ ఇవ్వాలో తెలుసుకున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.రేగటి అనిల్ రెడ్డి తో పాటు బాలాజీ రెడ్డి, రవితేజ, శివ రాఘవ,ప్రదీప్ రెడ్డి, కూరాకు శ్రీనివాస దత్తాత్రేయ, కూరాకు ఆంజనేయ ప్రసాద్, ప్రసాద్, షణ్ముఖ,పవన్ రాఘవేంద్ర, అశోక్ రెడ్డి, భార్గవ్, బాలకృష్ణ, నవీన్,మనీ, మనోజ్, సూర్యప్రకాశ్ రెడ్డి, సందీప్ కుమార్, కాసుల నవీన్, కాసుల నాగరాజు, సుబ్రహ్మణ్యం, వై రాజు, పవన్ కళ్యాణ్, సంపత్ రాజ్ కుమార్, బాలకృష్ణ మరియు వారి సన్నిహితులు స్నేహితులు అందరూ ఈరోజు వైఎస్ఆర్సిపి లో చేరడం జరిగింది