Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ కొరడా.. 12 బస్సులపై కేసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ కొరడా.. 12 బస్సులపై కేసులు

వార్త ముఖ్యాంశాలు

  • ముమ్మిడివరం/రావులపాలెం: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
  • అన్నంపల్లి, ఈతకోట టోల్ ప్లాజాల వద్ద బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో మొత్తం 33 బస్సులను పరిశీలించారు.
  • నిబంధనలు ఉల్లంఘించిన 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.18 వేల అపరాధ రుసుము విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

ముమ్మిడివరం/రావులపాలెం: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. అన్నంపల్లి, ఈతకోట టోల్ ప్లాజాల వద్ద బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో మొత్తం 33 బస్సులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.18 వేల అపరాధ రుసుము విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అత్యవసర ద్వారాల పనితీరు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. డ్రైవర్లకు భద్రతా జాగ్రత్తలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రావెల్స్ యాజమాన్యాలకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *