Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాత బిట్రగుంటలో జెడ్పి హై స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు, చైర్మన్ గా చల్లా రవి, వైస్ చైర్మన్ గా వాకా హరిత రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాత బిట్రగుంటలో జెడ్పి హై స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు, చైర్మన్ గా చల్లా రవి, వైస్ చైర్మన్ గా వాకా హరిత రెడ్డి.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
  • బోగోలు మండలంలోని పాత బిట్రగుంట జెడ్పీ హైస్కూల్‌లో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
  • కమిటీ పదవులకు పోటీదారులు లేకపోవడంతో చైర్మన్‌గా చల్లా రవి, వైస్ చైర్మన్‌గా వాకా హరిత రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

బోగోలు మండలంలోని పాత బిట్రగుంట జెడ్పీ హైస్కూల్‌లో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కమిటీ పదవులకు పోటీదారులు లేకపోవడంతో చైర్మన్‌గా చల్లా రవి, వైస్ చైర్మన్‌గా వాకా హరిత రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను రావి. విజయ్ కుమార్ తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతన విద్యా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి విద్యా కమిటీ సహకారం అందించాలని పలువురు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *