Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మార్కాపురంలో సఖి వన్ స్టాప్ సెంటర్‌కు భూమి పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మార్కాపురంలో సఖి వన్ స్టాప్ సెంటర్‌కు భూమి పూజ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

మార్కాపురంలో సఖి వన్ స్టాప్ సెంటర్‌కు భూమి పూజ

మార్కాపురంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనానికి గురువారం భూమి పూజ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

మహిళలు, బాలికలు హింసకు లేదా వివిధ సమస్యలకు గురైనప్పుడు తక్షణ రక్షణ, వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలను ఒకే వేదికపై అందించడమే సఖి కేంద్రం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సఖి వన్ స్టాప్ సెంటర్ మార్కాపురం ప్రాంత మహిళలు, బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *