Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పేదవారు కడుపు నింపటమే నిజమైన పండగ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పేదవారు కడుపు నింపటమే నిజమైన పండగ

*పేదవారి కడుపు నింపటమే నిజమైన పండగ*

*సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా*

*పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్యారీ పండుగ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అల్తాఫ్ బాబా*

ఇబ్రహీంపట్నం,

పేదవారి కడుపు నింపటమే నిజమైన పండగ అని అన్నారు సూఫీ మాత గురువులు అల్తాఫ్ బాబా. గార్వి పండుగ సందర్భంగా పశ్చిమ ఇబ్రహీంపట్నం మస్జిద్ వద్ద గురువారం రాత్రి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూఫీ మత గురువులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మస్జిద్ కమిటీ సభ్యులతో కలిసి అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పండుగ అయినా సరే ముందు పేదవారికి అన్నం పెట్టాలని అన్నారు. ఇస్లాంలో జరుపుకునే ప్రతి యొక్క పండగ ముఖ్య ఉద్దేశం కూడా పేదవారికి కడుపు నింపటమే అని తెలిపారు. ముందుగా గౌసే పాక్ జండా వద్ద ఫాతేహ ఖానీ నిర్వహించారు. అందరికీ మంచి జరగాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ సభ్యులు అల్తాఫ్ బాబా ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ ముస్తఫా, కోశాధికారి కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *