నందిగామ:
అనారోగ్యం కుటుంబ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేయకుండా, ఆపద సమయంలో అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 32 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేరుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఆపద వేళ ప్రభుత్వ సహాయం.. కుటుంబాలకు ఆర్థిక భరోసా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు.
ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి కారణంగా చికిత్సకు దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన వారుసద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. ప్రభుత్వపథకాలు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, తమకు అర్హత ఉన్న పథకాల వివరాలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హత ఉన్న ప్రతికుటుంబానికీ సంక్షేమ ఫలాలు
ప్రజల యోగక్షేమాలను పరిరక్షిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సౌమ్య స్పష్టం చేశారు.
“ప్రజలకు కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరైనా అనారోగ్యం లేదా ఇతర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సంబంధిత ప్రభుత్వ సహాయ పథకాలపై సమాచారం తెలుసుకోవాలి. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలి” అని ఆమె సూచించారు.
ప్రజలకు ఎలాంటిఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనా లను అర్హులైన ప్రతికుటుంబం పొందాలంటే ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోకుండా అందుబాటు లో ఉన్న ప్రభుత్వ సహాయ మార్గాలపై సంబంధిత అధికారులను సంప్రదించా లని సూచించారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయం లో అందిన ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్ టి ఆర్ జిల్లా
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ