Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గిరిజన ఆశ్రమ పాఠశాలలకు రూ.4.72 కోట్ల నిధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిరిజన ఆశ్రమ పాఠశాలలకు రూ.4.72 కోట్ల నిధులు

వార్త ముఖ్యాంశాలు

  • లోకేశ్వరం:నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4.72 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.
  • గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
  • భైంసా ఆశ్రమ పాఠశాలకు రూ.1.90 కోట్లు, దోడర్నకు రూ.99 లక్షలు, తానూర్ ఆశ్రమ పాఠశాలకు రూ.1.73 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

లోకేశ్వరం:నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4.72 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భైంసా ఆశ్రమ పాఠశాలకు రూ.1.90 కోట్లు, దోడర్నకు రూ.99 లక్షలు, తానూర్ ఆశ్రమ పాఠశాలకు రూ.1.73 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని 15 గిరిజన తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.1.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *