కలిగిరి, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 1:
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కోతపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. SMC చైర్మన్గా బందా తిరుపతయ్య, వైస్ చైర్మన్గా జలగం లక్ష్మిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల సమన్వయంతో కృషి చేస్తాం. పాఠశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం” అని నూతన SMC చైర్మన్ బందా తిరుపతయ్య పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేట MPP పాఠశాలలో ఏకగ్రీవంగా SMC ఎన్నికలు : చైర్మన్గా బందా తిరుపతయ్య.. వైస్ చైర్మన్గా జలగం లక్ష్మిదేవి
కలిగిరి, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 1: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కోతపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. SMC చైర్మన్గా బందా తిరుపతయ్య, వైస్ చైర్మన్గా జలగం లక్ష్మిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల సమన్వయంతో కృషి చేస్తాం. పాఠశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం” అని నూతన SMC చైర్మన్ బందా తిరుపతయ్య పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, SMC సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

