Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

వీఆర్ఏల మోకాళ్లపై నిరసన*–

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వీఆర్ఏల మోకాళ్లపై నిరసన*–

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల 15వ రోజు సమ్మె కొనసాగింది.
  • సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
  • ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలని, వీఆర్ఏలకు వీఆర్వో పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల 15వ రోజు సమ్మె కొనసాగింది. సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలని, వీఆర్ఏలకు వీఆర్వో పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్టోబర్ 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ వద్ద అన్ని మండలాల వీఆర్ఏలు సహాయ నిరాకరణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 2న తిరిగి తహశీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎర్ర బూరిగలు, మండల అధ్యక్షులు ఆకతర్ భాష, నగేష్, శేఖర్, మౌలాలి, విజయ్, శివలింగం, జయకృష్ణ, చెన్నయ్య, యశ్వంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *