Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

పెన్షనర్ల నిరసన బకాయిలు చెల్లించాలని డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెన్షనర్ల నిరసన బకాయిలు చెల్లించాలని డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
  • జిల్లా అధ్యక్షులు కె.
  • రామసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి డి.

నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కె. రామసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెన్షన్ సవరణ చేపట్టాలని, 50 శాతం కరువు భత్యాన్ని పెన్షన్‌లో విలీనం చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తదితర 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రామయ్య, డి. గఫారు, వీకే మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *