Thursday, 1 October 2026
  • Home  
  • పదవీ విరమణ చేసిన నలుగురు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఘన వీడ్కోలు
- వరంగల్

పదవీ విరమణ చేసిన నలుగురు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఘన వీడ్కోలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ ఈరోజు పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ గారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్స్పెక్టర్లు, ఎమ్.లక్ష్మీనారాయణ, పి.కొమురయ్య, సి.హెచ్.పర్శురాములు, బి.రమేష్ లు వున్నారు. అనంతరం జ్ఞాపికలు, బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎంతో ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, సంపూర్ణ ఆరోగ్యంతో పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరిగా ఉంటుందని, పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు ఎంతో గౌరవనీయమైనవని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు. వారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గారు ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పరిపాలన) ఆర్. ప్రభాకర్ రావు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.ఆర్.) సురేష్,ఎస్. సురేంద్ర, ఆర్.ఐ. సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కర్ణాకర్, పోలీస్ సిబ్బంది మరియు పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ ఈరోజు పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ గారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్స్పెక్టర్లు, ఎమ్.లక్ష్మీనారాయణ, పి.కొమురయ్య, సి.హెచ్.పర్శురాములు, బి.రమేష్ లు వున్నారు. అనంతరం జ్ఞాపికలు, బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎంతో ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, సంపూర్ణ ఆరోగ్యంతో పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరిగా ఉంటుందని, పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు ఎంతో గౌరవనీయమైనవని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు. వారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గారు ఆకాంక్షించారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పరిపాలన) ఆర్. ప్రభాకర్ రావు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.ఆర్.) సురేష్,ఎస్. సురేంద్ర, ఆర్.ఐ. సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కర్ణాకర్, పోలీస్ సిబ్బంది మరియు పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.