Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే దిగవంత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి 2 వ నెల పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద కాగాడాలతో ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించిన పూర్వపు తెలంగాణ ఉద్యమ కారులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే దిగవంత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి 2 వ నెల పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద కాగాడాలతో ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించిన పూర్వపు తెలంగాణ ఉద్యమ కారులు.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఈ సందర్భంగా పూర్వపు తెలంగాణ (2001) ఉద్యమకారులు మాట్లాడుతూ..
2001 నుండి తెలంగాణ ఉద్యమం పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బాటలో ముందుకు నడవడం జరిగింది
గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..
తెలంగాణ ఉద్యమంలో పెద్ది పోషించిన పాత్ర చిరస్మరణీయం
నాటి టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పెద్ది అందించిన సేవలు మరువలేనిది
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తెలంగాణ ఉద్యమానికి ఏ నాటికి తీరని లోటు .
ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయాలి
ఉద్యమానికి ఊపిరి పోసి ఆనాడు నర్సంపేట అంటే ఉద్యమాల గడ్డ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి ముందుకు నడిపించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన జీవితం మొత్తం ఉద్యమమే ఊపిరిగా ప్రజలే కుటుంబం అని ముందుకు అని సాగాడు ..
ప్రజా జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట , ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నరావుపేట మండలాల పూర్వపు ఉద్యమకారులు పాల్గొన్నారు.

నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే దిగవంత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి 2 వ నెల పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద కాగాడాలతో ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించిన పూర్వపు తెలంగాణ ఉద్యమ కారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *