Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాధాకృష్ణయ్య సేవలు చిరస్మరణీయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాధాకృష్ణయ్య సేవలు చిరస్మరణీయం

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) విద్యార్థులను సొంత బిడ్డల్లా..
  • అధ్యాపకులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ, కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన స్వర్గీయ సనిశెట్టి రాధాకృష్ణయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు.
  • డా.

ఆత్మకూరు, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) విద్యార్థులను సొంత బిడ్డల్లా.. అధ్యాపకులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ, కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన స్వర్గీయ సనిశెట్టి రాధాకృష్ణయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. డా. ఎస్.ఆర్.జె. డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌గా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ బుధవారం కళాశాల ప్రాంగణంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోళ్ల వరకుమారి, పీడీ సిరిమామిళ్ల వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ డా. శ్రీనివాసులురెడ్డి, డైరెక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి పాల్గొని రాధాకృష్ణయ్య సేవలను స్మరించుకున్నారు.వారు మాట్లాడుతూ కరస్పాండెంట్‌గా రాధాకృష్ణయ్య ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారని, ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రద్ధ తీసుకునేవారని తెలిపారు. ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించారని గుర్తుచేశారు. స్వతహాగా అధ్యాపకులు కావడంతో కరస్పాండెంట్‌గా కాకుండా తమలో ఒకరిగా మెలిగేవారని పేర్కొన్నారు.రాధాకృష్ణయ్య లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అధ్యాపకులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రార్థించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కె. కాత్యాయని, అంకమ్మ, సుప్రియ, రేణుక, శ్రీనివాసులు, వెంకట్రావు, రవీంద్ర, రాజమోహన్, కొండయ్య, విజయకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *