Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు – చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు – చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత

ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించిన “చలో అసెంబ్లీ” కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదివారం అర్థరాత్రి నుంచే ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతలను వారి నివాసాల వద్దనే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం.

బీజేపీ శ్రేణులు ఈ అరెస్టులను అక్రమంగా అభివర్ణిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యల భాగంగా ఈ అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు

జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు – చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *