Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎండీ ఏజాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎండీ ఏజాజ్

వార్త ముఖ్యాంశాలు

  • పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
  • యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం సభ్యులు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారు.
  • 2024-2026 కాలానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఎండీ ఏజాజ్ ఈసారి 'ఉంగరం' గుర్తుపై పోటీ పడుతున్నారు.బుధవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏజాజ్ మాట్లాడుతూ..

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది. యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం సభ్యులు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారు. 2024-2026 కాలానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఎండీ ఏజాజ్ ఈసారి ‘ఉంగరం’ గుర్తుపై పోటీ పడుతున్నారు.బుధవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏజాజ్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల జీవనోపాధి, వృత్తిపరమైన భద్రత, ఆర్థిక సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు డ్రైవర్లందరికీ అందేలా చూడటమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. ఆటో రంగానికి సంబంధించి డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం డ్రైవర్ల సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *