Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

జిల్లా స్థాయి FLN Cellకు సాలికినేని రాజశేఖర్ ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జిల్లా స్థాయి FLN Cellకు సాలికినేని రాజశేఖర్ ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • పాల్వంచ: పాల్వంచ మండల విద్యాశాఖలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి సేవలందించిన శ్రీ సాలికినేని రాజశేఖర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా FLN Cell / DPMUలో తెలుగు విషయ నిపుణులుగా విధులు నిర్వహించేందుకు ఎంపికయ్యారు.
  • ఈ సందర్భంగా ZPHS యానంబైలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.
  • ప్రకాశరావు గారు, CRP శెట్టిపల్లి ప్రభాకర్ గారు రాజశేఖర్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

పాల్వంచ: పాల్వంచ మండల విద్యాశాఖలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి సేవలందించిన శ్రీ సాలికినేని రాజశేఖర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా FLN Cell / DPMUలో తెలుగు విషయ నిపుణులుగా విధులు నిర్వహించేందుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ZPHS యానంబైలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ప్రకాశరావు గారు, CRP శెట్టిపల్లి ప్రభాకర్ గారు రాజశేఖర్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
మండల స్థాయిలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన రాజశేఖర్ గారు, తన ప్రతిభ, అనుభవం మరియు సేవాభావంతో జిల్లా స్థాయిలో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
జిల్లా స్థాయిలో కూడా తన జ్ఞానం, అనుభవంతో విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు బి. ప్రకాశరావు, CRP శెట్టిపల్లి ప్రభాకర్ ఆకాంక్షించారు.
రాజశేఖర్ గారి నూతన బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *