Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

*వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!!

వార్త ముఖ్యాంశాలు

  • *వైన్ షాప్ వచ్చింది...!
  • ఉద్యోగం పోయింది..!!* మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ గా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి *ధర్మపూర్ వైన్‌షాప్* లక్కీ డిప్‌లో దక్కింది.
  • ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు.

*వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!!*

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ గా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి *ధర్మపూర్ వైన్‌షాప్* లక్కీ డిప్‌లో దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండడంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేవరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ ఇవాళ *పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు* జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *