Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

వృద్ధాప్య పింఛన్లపై వీడని నిరీక్షణ.. ఖమ్మం జిల్లా లొ 27,772 దరఖాస్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వృద్ధాప్య పింఛన్లపై వీడని నిరీక్షణ.. ఖమ్మం జిల్లా లొ 27,772 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో కొత్తగా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశ ఎదురవుతోంది. కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియలో భాగంగా ఖమ్మం జిల్లాలో మొత్తం 27,772 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు సమాచారం. అయితే వృద్ధాప్య పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టడంపై వృద్ధుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత ఉన్నప్పటికీ తమకు పింఛన్ మంజూరు కాకపోవడంపై పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

వృద్ధాప్య పింఛన్లపై వీడని నిరీక్షణ.. ఖమ్మం జిల్లా లొ 27,772 దరఖాస్తులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *