Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఆపదలో ఆపద్బాంధవుడు.. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆపదలో ఆపద్బాంధవుడు.. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్

మానవత్వానికి ఎల్లలు లేవని చాటే ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడిని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు. కలెక్టరేట్ సమీపంలో వాటర్ క్యాన్లతో వెళ్తున్న ఆటో ట్రాలీ ప్రమాదానికి గురికావడంతో అభిషేక్ రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయాడు. అదే సమయంలో విధులు ముగించుకుని వెళ్తున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు. 108 అంబులెన్స్ అటుగా వెళ్లినా బాధితుడిని తరలించకపోవడంతో ఆలస్యం చేయకుండా అభిషేక్‌ను తన కారులో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించగా కుడి తొడ భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి, బాధితుడి పరిస్థితిని పర్యవేక్షించారు. అపరిచితుడైనా ఆపదలో ఆదుకున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సేవాభావాన్ని పలువురు అభినందించారు.

ఆపదలో ఆపద్బాంధవుడు.. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *