Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

స్వచ్ఛ నిర్మల్‌కు ప్రజల భాగస్వామ్యం అవసరం – లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్వచ్ఛ నిర్మల్‌కు ప్రజల భాగస్వామ్యం అవసరం – లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు.
  • బుధవారం మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేశారు.

నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. బుధవారం మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడంతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *