Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకొల్లువారిపాలెంలో రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాకొల్లువారిపాలెంలో రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కాకొల్లువారిపాలెంలో సందడి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *