Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పల్లె అభివృద్ధి గౌతమి ప్రభుత్వ లక్ష్యం నందిగామ నియోజకవర్గ ) తంగిరాల సౌమ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె అభివృద్ధి గౌతమి ప్రభుత్వ లక్ష్యం నందిగామ నియోజకవర్గ ) తంగిరాల సౌమ్య

పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

జుజ్జూరులో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన — గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కృషి..

వీరులపాడు: పల్లెల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పేర్కొన్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.80 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చోట అభివృద్ధి పనులను మంజూరు చేయిస్తున్నామని తెలిపారు.పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జుజ్జూరు గ్రామంలో రూ.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, నందిగామ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తంగిరాల సౌమ్య గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీ చైర్మన్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పల్లె అభివృద్ధి గౌతమి ప్రభుత్వ లక్ష్యం నందిగామ నియోజకవర్గ ) తంగిరాల సౌమ్య

పల్లె అభివృద్ధి గౌతమి ప్రభుత్వ లక్ష్యం నందిగామ నియోజకవర్గ ) తంగిరాల సౌమ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *