Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం విద్య కమిటీ ఎన్నిక పాల్గొన్న దండుపాటి విజయ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం విద్య కమిటీ ఎన్నిక పాల్గొన్న దండుపాటి విజయ్

:29, పున్నమి న్యూస్ ప్రతినిధి మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం :విద్యా కమిటీ ఎన్నిక సమావేశంలో పాల్గొన్న దొండపాటి విజయ్ కుమార్*

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని‌ పాఠశాలలలో విద్యా కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించాలనే పిలుపు మేరకు మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నిక సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన ముదునూరు ఝాన్సీ రాణి మరియు ఉపాధ్యక్షులు చట్టు నాగభూషణం లను దుశ్శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. స్కూల్లో డ్రాప్ అవుట్లను తగ్గించి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యా కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎప్పటికప్పుడు పాఠశాలలోని భోజన సదుపాయాలను పరిశీలించాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట మాధవరావు, కూటమి నాయకులు నండూరి వెంకటేశ్వరరావు, లోయ సుధాకర్, బండారు వెంకటేశ్వరరావు, దొండపాటి కోటేశ్వరావు, కందుల శ్రీను, బట్టా నాగరాజు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం విద్య కమిటీ ఎన్నిక పాల్గొన్న దండుపాటి విజయ్

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం విద్య కమిటీ ఎన్నిక పాల్గొన్న దండుపాటి విజయ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *