Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హాస్టల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హాస్టల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28(పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండల కేంద్రంలోని ఎస్సీ బాలబాలికల వసతి గృహాలను ఏఎన్డబ్ల్యూవో సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, తువ్వాళ్లు, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు.
  • అనంతరం విద్యార్థులతో మాట్లాడి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28(పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండల కేంద్రంలోని ఎస్సీ బాలబాలికల వసతి గృహాలను ఏఎన్డబ్ల్యూవో సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు, తువ్వాళ్లు, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-2 పరీక్షల్లో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *