Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

కాపు బలిజ జేఏసీకి కొత్త సారథి.. మిద్దె సుబ్బారెడ్డి జిల్లా వ్యాప్తంగా జేఏసీ బలోపేతమే లక్ష్యం-

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాపు బలిజ జేఏసీకి కొత్త సారథి.. మిద్దె సుబ్బారెడ్డి జిల్లా వ్యాప్తంగా జేఏసీ బలోపేతమే లక్ష్యం-

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు బలిజ జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కాపు బలిజ జేఏసీ అధ్యక్షుడిగా మిద్దె వెంకట సుబ్బారెడ్డి (సుబ్బయ్య రాయల్)ను నియమించారు.
  • సోమవారం ఒక ప్రకటనలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో కాపు బలిజ జేఏసీని మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో విస్తరించి మరింత బలోపేతం చేస్తానన్నారు.
  • కాపు బలిజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు బలిజ జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కాపు బలిజ జేఏసీ అధ్యక్షుడిగా మిద్దె వెంకట సుబ్బారెడ్డి (సుబ్బయ్య రాయల్)ను నియమించారు. సోమవారం ఒక ప్రకటనలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో కాపు బలిజ జేఏసీని మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో విస్తరించి మరింత బలోపేతం చేస్తానన్నారు. కాపు బలిజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత, మహిళలను జేఏసీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సంఘాన్ని పటిష్టం చేస్తామని తెలిపారు.పదవులు పొందిన వారు: గౌరవ సలహాదారుగా కొణిదెల ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా చిమ్మ నాగ వెంకట రవికుమార్, ట్రావెల్స్ వెల్ఫేర్ అధ్యక్షుడిగా అలా వెంకట నాగిరెడ్డి, మహిళా అధ్యక్షురాలిగా సంగ జయంతి, యువజన అధ్యక్షుడిగా సూరిశెట్టి మధు, జిల్లా కార్యదర్శిగా చింతల నాగకుమార్, కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడిగా పసుపులేటి ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా తోట వెంకటేశ్వర్లు, ముద్రణ మాధ్యమం జిల్లా అధ్యక్షుడిగా అనుమల శ్రీనివాసులు, జిల్లా సహాయక కార్యదర్శిగా అల్లాడి నాగేశ్వరరావు తదితరులను నియమించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *