డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘం 26వ వార్డులో మెప్మా (MEPMA) నిధులు రూ.30 లక్షల వ్యయంతో ఆధునీకరించిన నూతన ఫిష్ మార్కెట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అయితబత్తుల ఆనందరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి అత్యంత ఆప్తులైన మత్స్యకార సోదరీమణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మార్కెట్‌లో వ్యాపారులకు, వినియోగదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ, ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్నారు. మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, వ్యాపార పురోగతికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు. ఆధునీకరించిన మార్కెట్ వల్ల మత్స్యకారులకు మెరుగైన వాణిజ్య వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు.



