డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్‌కు తొలి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డా. ఆర్. మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక అధికారిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల పర్యవేక్షణ, జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని కార్యక్రమాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్