వార్త ముఖ్యాంశాలు
- 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఇద్దరు ముద్దాయిల అరెస్ట్..
- పోలీసులను అభినందించిన ఎస్పీ వీరబల్లి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వీరబల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
- వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.. పోలీసులను అభినందించిన ఎస్పీ
వీరబల్లి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వీరబల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలై జిల్లాకు చెందిన షేక్ బర్క్ తుల్లా నూరుల్లా, పొన్నుస్వామి మాణిక్యంలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 11 ఎర్రచందనం దుంగల మొత్తం బరువు 382 కిలోలు కాగా, వాటి విలువ సుమారు రూ.19.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిందితులను పట్టుకుని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న వీరబల్లి ఎస్ఐ సుస్మితతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అక్రమ ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.