Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా..?కూటమి పాలనపై రాజేశ్వరి రెడ్డి ధ్వజం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

రాష్ట్రంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడం తప్పా అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి ప్రశ్నించారు. సోమవారం సిద్ధవటం మండలం భాకరాపేటలోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ విజయవాడలో సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులు తమ హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకున్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయని తెలిపారు.ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా వారి పోరాటాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. హక్కులను కాలరాస్తే ప్రభుత్వాలను మార్చిన సంఘటనలు గతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రాజేశ్వరి రెడ్డి కోరారు.రాష్ట్రంలో కూటమి పాలన అరాచకంగా మారిందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న మీడియాపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు, అవినీతి అంశాలపై వార్తలు ప్రసారం చేస్తున్న పత్రికలు, టీవీ చానళ్ల గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆరోపించారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రధాన మీడియా సంస్థలకు మైనింగ్, కాంట్రాక్టులు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజేశ్వరి రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగులు, మీడియా సంస్థలపై ఒత్తిళ్లు తీసుకురావడం మానుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రానున్న రోజుల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని రాజేశ్వరి రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా..?కూటమి పాలనపై రాజేశ్వరి రెడ్డి ధ్వజం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *