Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రపంచ గుండె దినోత్సవం (World Heart Day)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రపంచ గుండె దినోత్సవం (World Heart Day)

వార్త ముఖ్యాంశాలు

  • ప్రపంచ గుండె దినోత్సవం (World Heart Day) పురస్కరించుకుని ప్రజల్లో గుండె ఆరోగ్యం, జీవనశైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స పొందడంపై అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరులోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 29, 2026) ఉదయం 6:00 గంటల నుండి 9:00 గంటల…
  • ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా, మున్సిపల్ కమిషనర్ టి.
  • శ్రీనివాస విశ్వనాథ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.

ప్రపంచ గుండె దినోత్సవం (World Heart Day) పురస్కరించుకుని ప్రజల్లో గుండె ఆరోగ్యం, జీవనశైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స పొందడంపై అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరులోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 29, 2026) ఉదయం 6:00 గంటల నుండి 9:00 గంటల వరకు భారీ ‘వాకథాన్’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా, మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస విశ్వనాథ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.

ఆసుపత్రి యూనిట్ హెడ్ మిస్టర్ డి. పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ ర్యాలీ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద ప్రారంభమై, రాజీవ్ సర్కిల్ మరియు శివాలయం సర్కిల్ మీదుగా తిరిగి ఆసుపత్రికి చేరుకుంటుంది. ఇందులో వైద్యులు, విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ప్రజలంతా ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకునేలా చైతన్యపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *