Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. మహిళలను గౌరవించాలి రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలి: ఎమ్మెల్యే తాతయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. మహిళలను గౌరవించాలి రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలి: ఎమ్మెల్యే తాతయ్య

వార్త ముఖ్యాంశాలు

  • జగ్గయ్యపేట ప్రతినిధి యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు.
  • జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో సత్య ఎలక్ట్రానిక్స్ పైన ఉన్న గ్రాండ్ వధూవర్ ఫంక్షన్ హాల్‌లో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన “త్రిశూల వ్యూహం” కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ..

జగ్గయ్యపేట ప్రతినిధి

యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు.

జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో సత్య ఎలక్ట్రానిక్స్ పైన ఉన్న గ్రాండ్ వధూవర్ ఫంక్షన్ హాల్‌లో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన “త్రిశూల వ్యూహం” కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.

మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలని, విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అలాగే రోడ్డు భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని సూచించారు.

డ్రగ్స్ నిర్మూలన – మహిళల భద్రత – రోడ్డు భద్రత అనే మూడు ప్రధాన అంశాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే తాతయ్య అభినందించారు. సమాజంలో సురక్షితమైన వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులతో పాటు ప్రజలు, విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *