Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తెలుగు యువత నాయకుడు సురేంద్ర ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తెలుగు యువత నాయకుడు సురేంద్ర ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
  • ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
  • సురేంద్ర కుమార్ ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పున్నమి న్యూస్ కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. సురేంద్ర కుమార్ ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు సిద్ధన రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు అత్కూరి రాంబాబు, నీలం వీరభద్రరావు, తిరుమలశెట్టి సత్యనారాయణ, అక్యాబత్తుల లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *