Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 19 వసంతాల సినీ ప్రస్థానం సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 19 వసంతాల సినీ ప్రస్థానం సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నేడు "గ్లోబల్ స్టార్" స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ తేజ్ సినీ రంగంలో విజయవంతంగా 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.ఈ అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని, నంద్యాల మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నంద్యాలలోని…

మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నేడు “గ్లోబల్ స్టార్” స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ తేజ్ సినీ రంగంలో విజయవంతంగా 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.ఈ అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని, నంద్యాల మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నంద్యాలలోని సంగీత్ థియేటర్ వద్ద మెగా అభిమానులు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.కన్నుల పండువగా సాగిన ఈ సంబరాల్లో అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ స్టేట్ కో కన్వీనర్ పబ్బతి రవి,ఉమ్మడి కర్నూలు జిల్లా కో కన్వీనర్ బ్లడ్ అచ్చు,నంద్యాల నియోజక వర్గ అధ్యక్షులు సురేష్ చౌదరి,జాయింట్ కన్వీనర్ సాయి జయంత్ , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంధానీ పాల్గొన్నారు.రామ్ చరణ్, మెగాస్టార్ నినాదాలతో సంగీత్ థియేటర్ ప్రాంగణం దద్దరిల్లింది.ఇలాంటి మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని, బ్లాక్ బస్టర్ హిట్లతో అభిమానులను మరింత అలరించాలని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియచేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *