వార్త ముఖ్యాంశాలు
- *పెళ్లకూరు, సెప్టెంబర్ 27:* పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి డా.
- కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.
- ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు.
*పెళ్లకూరు, సెప్టెంబర్ 27:*
పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.
ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.