Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

ఎల్బీనగర్: చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 14 రోజులుగా చైతన్యపురి నుంచి సరూర్‌నగర్ వరకు వివిధ కార్యక్రమాలు, స్వామివారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి ప్రసాదమైన లడ్డూను వేలం పాట నిర్వహించగా, ఆశిష్ కుమార్ రూ.37,100కు లడ్డూను దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా ఆశిష్ కుమార్ మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో వరుసగా మూడోసారి స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృపతో ప్రతి సంవత్సరం ఇలాగే వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకుంటానని తెలిపారు.

గత 14 రోజులుగా నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీ వినాయక భక్త సమాజ్ నిర్వాహకులు తెలిపారు.

శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ₹37,100కు లడ్డూ వేలం దక్కించుకున్న ఆశిష్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *